AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjanar: గుట్కా నములుతూ బస్సు నడిపితే కఠిన చర్యలు.. ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్‌ హెచ్చరిక..

ఆర్టీసీ ఎండీగా వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు వీసీ సజ్జనార్‌. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ప్రయాణికులకు మెరుగైన..

Sajjanar: గుట్కా నములుతూ బస్సు నడిపితే కఠిన చర్యలు.. ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్‌ హెచ్చరిక..
Basha Shek
|

Updated on: Nov 02, 2021 | 7:24 AM

Share

ఆర్టీసీ ఎండీగా వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు వీసీ సజ్జనార్‌. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్లు గుట్కాలు, ఇతర పొగాకు పదార్థాలు నములుతూ డ్రైవింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన డ్రైవర్లపై క్రమశిక్షలు చర్యలు తీసుకునేలా ఈడీలు, డీవీఎంలు, డీఎంలకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రయాణికుల పట్ల పద్ధతిగా ఉండాలి.. కొందరు ఆర్టీసీ డ్రైవర్లు డ్రైవింగ్‌ సమయంలో గుట్కాలు, ఇతర పొగాకు పదార్థాలు నములుతూ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. అంతేకాదు బస్సులను కూడా అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు. వీటిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందడంతో సజ్జనార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆర్టీసీ డ్రైవర్‌ బస్సుకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ లాంటి వాళ్లు. వారు ప్రయాణికుల పట్ల పద్ధతిగా వ్యవహరించాలి. పొగాకు పదార్థాలు నములుతూ బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదు. ఎవరైనా ఈ ఆదేశాలకు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’ అని సజ్జనార్‌ హెచ్చరించారు. ఈ మేరకు డిపో మీటింగ్స్‌లో ఈ విషయంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, తరచూ తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌ జారీ చేశారు.

Also Read:

Kakatiya University: కాకతీయలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. లాఠీ ఝుళిపించిన పోలీసులు

Trs vs Bjp: బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడండి.. మంత్రి హరీష్ రావు మార్క్ కామెంట్స్..

TRS Telangana Vijaya Garjana: టీఆర్ఎస్ తెలంగాణ విజయ గర్జన సభ వాయిదా.. మరో తేదీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్..