AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ‘ఇబ్బంది ఎందుకు? మేమున్నాం కదా’.. సంక్రాంతికి ఊరేళ్లే ప్రయాణికులకు సజ్జనార్ కీలక సూచన..

ఆర్టీసీ సర్వీసులను ప్రజలకు దగ్గర చేసుకుందుకై.. లభించిన ఏ అవకాశాన్నీ మిస్ చేయడం లేదు సంస్థ ఎండీ సజ్జనార్. ప్రతి సందర్భాన్ని ఆర్టీసీకి అన్వయిస్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు..

TSRTC: ‘ఇబ్బంది ఎందుకు? మేమున్నాం కదా’.. సంక్రాంతికి ఊరేళ్లే ప్రయాణికులకు సజ్జనార్ కీలక సూచన..
Rtc Md Sajjanar
Shiva Prajapati
|

Updated on: Jan 13, 2023 | 9:28 AM

Share

ఆర్టీసీ సర్వీసులను ప్రజలకు దగ్గర చేసుకుందుకై.. లభించిన ఏ అవకాశాన్నీ మిస్ చేయడం లేదు సంస్థ ఎండీ సజ్జనార్. ప్రతి సందర్భాన్ని ఆర్టీసీకి అన్వయిస్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా సంక్రాంతి పర్వదినాన రవాణా విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి వేలాది మంది ప్రజలు తమ తమ సొంతూళ్లకు వెళుతున్నారు. అయితే, ఎవరికి వారు తమ సొంత వాహనాల్లో ఊళ్లకు వెళుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రయాణికులకు కీలక సూచన చేశారు. ‘ఎందుకు అంత ఇబ్బంది పడతారు.. మేమున్నాం కదా మీకు అండగా’ అంటూ ఓ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

‘సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు.’ అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి రద్దీ..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో హైదరాబాదులోని బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు తమ తమ స్వగ్రామాలకు వెళ్తారు. సంక్రాంతి పండగ కోసం ఆర్టీసీ దాదాపు 4వేలకు పైగా సర్వీసులు, రైల్వే 125 ప్రత్యేక సర్వీసులు నడిపినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకడించడంతో నగర వాసులు సొంత ఊళ్ళ బాట పట్టారు. ఈ క్రమంలో సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్సు స్టేషన్లతో పాటు నగరంలోని అన్ని ప్రధాన రహదారులు ప్రయాణాల సందడితో కిటకిటలాడాయి. నిజాంపేట, కూకట్‌పల్లి, సంజీవ్ రెడ్డి నగర్, అమీర్ పెట్, లక్డికాపూల్, కోఠి లాంటి ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది.

సజ్జనార్ ట్వీట్ ఇదే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్