AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS High court jobs: బీటెక్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు సదవకాశం, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు పొందే లక్కీ ఛాన్స్‌. తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్..

TS High court jobs: బీటెక్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Ts High Court Jobs
Narender Vaitla
|

Updated on: Jan 13, 2023 | 9:06 AM

Share

బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు సదవకాశం, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు పొందే లక్కీ ఛాన్స్‌. తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్(నం.08/2023) జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 సిస్టమ్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ)/ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ ఐటీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌పై పరిజ్ఞానం ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్‌/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీ పరీక్ష (90 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.

* పరీక్ష విధానం విషయానికొస్తే.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)లో 90 (కంప్యూటర్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.

* ఓసీ/బీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 600, ఎస్సీ.. ఎస్టీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 21-01-2023న మొదలవుతుండగా, 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* కంప్యూటర్‌ బేస్‌డ్‌ హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ను 20-02-2023 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను మార్చి 2023లో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..