AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Bus for Women: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్.. నేటి నుంచి నగరంలో మహిళల కోసం స్పెషల్ బస్‌లు..

తెలంగాణ ఆర్టీసీ మహిళల కోసం స్పెషల్ బస్ నడిపేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈ రోజు నుండి ఐటి కరిడాల్ లో పని చేసే లేడీస్ కోసం లేడీస్ స్పెషల్ బస్‌ను ఏర్పాటు చేసింది. జేఎన్‌టీయూ నుంచి వెవ్ రాక్ వరకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నడపనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్ లతో ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీ ఆదాయం పెంచడం కోసం కృషి చేస్తుంది తెలంగాణ ఆర్టీసీ. దీంట్లో భాగంగా అన్ని వర్గాల కోసం స్పెషల్..

Special Bus for Women: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్.. నేటి నుంచి నగరంలో మహిళల కోసం స్పెషల్ బస్‌లు..
TSRTC Ladies Special bus
Yellender Reddy Ramasagram
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 31, 2023 | 4:25 PM

Share

హైదరాబాద్‌, జులై 31: తెలంగాణ ఆర్టీసీ మహిళల కోసం స్పెషల్ బస్ నడిపేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈ రోజు నుండి ఐటి కరిడాల్ లో పని చేసే లేడీస్ కోసం లేడీస్ స్పెషల్ బస్‌ను ఏర్పాటు చేసింది. జేఎన్‌టీయూ నుంచి వెవ్ రాక్ వరకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నడపనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్ లతో ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీ ఆదాయం పెంచడం కోసం కృషి చేస్తుంది తెలంగాణ ఆర్టీసీ. దీంట్లో భాగంగా అన్ని వర్గాల కోసం స్పెషల్ ఆఫర్ లు ప్రకటిస్తుంది ఆర్టీసీ. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక సర్వీస్ నడిపేందుకు సిద్దం అయింది తెలంగాణ ఆర్టీసీ. ఈ రోజు నుండి జేఎన్‌టీయూ నుంచి వేవ్ రాక్ మార్గంలో మహిళల కోసం స్పెషల్ బస్ ప్రారంభించారు అధికారులు. ఈ స్పెషల్ లేడీస్ బస్ కి వచ్చే ఆదరణ తరవాత మరిన్ని రూట్ లలో నడిపేందుకు సిద్దం అవుతుంది ఆర్టీసీ.

ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్ బస్సును అందుబాటులోకి తెచ్చింది.ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడుపుతుంది. నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 5లక్షలకు పైగా మహిళలు ఉద్యోగులుగా పని చేస్తున్నరు… వారి కోసం స్పెషల్ గా బస్సులను నడపాలని ఆర్టీసీ భావించింది. ఇందులో భాగంగా పెలైట్‌ ప్రాజెక్టుగా ఈ రోజు నుండి మహిళ స్పెషల్ బస్ నీ స్టార్ట్ చేసింది.

ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి మార్నింగ్ 9 గంటలకు బస్ స్టార్ట్ అవుతుంది.ఈ బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది. ఈవినింగ్ 6 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి రిటర్న్ బయలుదేరి జేఎన్‌టీయూకు వెళ్తుంది అని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రయోగాత్మకంగా నడుపుతున్న సర్వీసు సక్సెస్ అయితే మరిన్ని రూట్ లలో నడిపించాలని ఆర్టీసీ భావిస్తున్నది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు యుస్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.