Hyderabad ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్పీడ్ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
Hyderabad News: ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్‌ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు అంబాటులో ఉంది. అయితే ఈ స్పీడ్‌ను ఇప్పుడు ప్రభుత్వం పెంచేలా చర్యలు తీసుకుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగం నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, జులై 31: ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్‌ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు అంబాటులో ఉంది. అయితే ఈ స్పీడ్‌ను ఇప్పుడు ప్రభుత్వం పెంచేలా చర్యలు తీసుకుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగం నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌కు అధికారులు జారీ చేశారు. ఇటీవల ఓఆర్ఆర్ అధికారులు, పోలీసులతో మంత్రి కేటీఆర్ ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత సోమవారం ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.
ఓవైపు చూసుకుంటే ఓఆర్‌ఆర్‌లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు గతంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓర్‌ఆర్‌ఆర్‌పై వేగ పరిమితిని 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఓఆర్ఆర్‌ఆర్ ప్రయాణికులు భద్రతపై చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పీడ్ లిమిట్‌ను పెంచాలని భావించారు. ప్రస్తుతం దాదాపు 154 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్‌ఆర్‌పై లైటింగ్ సిస్టంతో పాటు రోడ్ సేఫ్టీ మేజర్స్ పాటిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు.దీంతో స్పీడ్ లిమిట్‌ను తిరిగి 120 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
1,2 లైన్లలో స్పీడ్ లిమిట్ గంటకు 120 కిలోమీటర్లకు పెంచారు. ఇక హెవీ వెహికల్స్ వెళ్లే లెన్ నంబర్ 3 & 4 లో 80 స్పీడ్ లిమిట్ ఉండనుంది. ఓఆర్ఆర్పై మాక్సిమం స్పీడ్ లిమిట్ గంటకు 80 కిలోమీటర్లు కాగా మినిమమ్ స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ పై తాజా నిబంధనలు అతిక్రమిస్తూ డ్రైవ్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ పై ఎక్కడిక్కడ స్పీడ్ లేజర్ గన్స్ అమర్చినట్టు తెలిపారు. ఓఆర్ఆర్ పై పిక్ అప్ డ్రాప్ చేసిన వాహనాలు నిలిపి ఉంచిన మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.