TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో సంచలన నిజాలు.. మూడేళ్లుగా అతని ఆధీనంలో కంప్యూటర్లు.
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో టీఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్‌తో పాటు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే...

టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో టీఎస్‌పీఎస్సీ టౌన్ ప్లానింగ్‌తో పాటు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం సిట్‌న్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక సమర్పించింది. మొదట్లో దీనంతటికీ ప్రవీణ్ కారణంగా అనున్న సిట్ దర్యాప్తులో రాజశేఖర్ అనే వ్యక్తి కారణంగా తేలింది.
రాజశేఖర్ ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చాడని సిట్ అధికారులు గుర్తించారు. రాజశేఖర్ టెక్నికల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. ప్రవీణ్‌తో రాజశేఖర్ సత్సంబంధాలు కొనసాగించాడు. శంకర్ లక్ష్మి కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించారు. ఇదిలా ఉంటే కేసు విచారణ జరుగుతున్నా కొద్దీ విస్తు పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత మూడేళ్ళుగా కంప్యూటర్లను రాశశేఖర్ తన ఆధీనంలో ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిర్వహణలోమే లీక్ కి ప్రధాన కారణంగా గుర్తించిన సిట్ అధికారులు. అత్యంత సులభంగా ఐపీ అడ్రస్‌లుమార్చి హ్యాక్ చేసినట్టు గుర్తించారు. ఇక రాజశేఖర్‌కు పరిచయం ఉన్నవారిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. గత మూడేళ్ళుగా రాజశేఖర్ ఏం చేశాడన్నదానిపై దృష్టిసారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..