AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంధువుల ఇంట్లో వివాహానికి అమెరికా నుంచి వచ్చి.. తిరిగి వెళ్తూ విగత జీవిగా మారిన యువతి..

ఆ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఓ వివాహం కోసమని వాళ్ల కూతురు ఇండియాకి వచ్చింది. కాసేపట్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా ఆమెను మృత్యువు వెంటాడింది.

బంధువుల ఇంట్లో వివాహానికి అమెరికా నుంచి వచ్చి.. తిరిగి వెళ్తూ విగత జీవిగా మారిన యువతి..
Accident
Aravind B
|

Updated on: Mar 19, 2023 | 3:39 PM

Share

ఆ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఓ వివాహం కోసమని వాళ్ల కూతురు ఇండియాకి వచ్చింది. కాసేపట్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా ఆమెను మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన కరణం పద్మానాయుడు కుటుంబం కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. ఇటీవల వారి బంధువుల కుటుంబంలో ఇటీవలే వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లికి పద్మనాయుడు కుమార్తె ప్రీతి వచ్చింది. పెళ్లి వేడుకలు అంతా అయిపోయాక తిరిగి ఆమె అమెరికా వెళ్లాల్సి ఉంది. శనివారం రాత్రి ఆమెకు హైదరాబాద్ లో ప్లైట్ ఉంది. అయితే సమీప బంధువులందరూ ఆమెను ఎయిర్ పోర్టులో దిగబెట్టేందుకు కారులో బయలుదేరారు.

విజయవాడ నుంచి వాళ్ల కారు నల్గొండ జిల్లాకు చేరుకుంది. అక్కడి నుండి హైదరాబాద్ కు వస్తుండగా చీకటిగూడెం శివారుకు రాగానే సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వెళుతున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు జాతీయ రహదారిపై ఏకంగా మూడు పల్టీలు కొట్టింది. తలకు తీవ్ర గాయాలైన కరణం ప్రీతి(21) అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న దొప్పలపూడి శ్రేయాస్‌, అందులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్‌, దివి పద్మావతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రులను చికిత్స కోసం నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని కేతేపల్లి ఏఎస్సై ఎన్‌.శ్రీనివాస్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!