TSGENCO: నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేసిన తెలంగాణ జెన్‌కో.. 11 రోజులు కొనసాగిన ఉత్పత్తి
Power Genaration Stop in Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో
Power Genaration Stop in Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. యజతఫ 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. 11 రోజుల్లో తెలంగాణ జెన్‌కో 30 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణ జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
ఇలా చేపట్టడం వల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే.. విద్యుత్ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేపడుతున్నామని.. తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే.. శ్రీశైలంలో నీరు గరిష్టంగా చేరకుండా ఉండేందుకే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ పేర్కొంటోంది.
ఈ క్రమంలో ఏపీ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై.. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రం, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదం సహా.. కృష్ణా జలాల కేటాయింపులపై ఈ నెల 24న కేఆర్ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు జల వివాదంపై చర్చలు జరిగాయి. మరోసారి జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Also Read: