TS Inter Admissions 2023-24: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పొడిగించిన బోర్డు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు జులై 25 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్ ప్రవేశాల గడువు జూన్ 30వ తేదీతో ముగిసింది. ఐతే ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ మేరకు గడువును పొడుగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని వారు గడువు తేదీలోగా కాలేజీలో చేరాలని సూచించింది. కాలేజీల జాబితానే బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందవచ్చని తెల్పింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.