TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. దళారుల సమాచారం అందిస్తే రూ.3 లక్షల నజరానా
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కొదరు దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి, మభ్యపెట్లి లక్షల డబ్బు వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) దృష్టికి..
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కొదరు దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి, మభ్యపెట్లి లక్షల డబ్బు వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) దృష్టికి వచ్చింది. అటువంటి దళారుల సమాచారం అందించిన వారికి రూ.3 లక్షల వరకు పోలీస్ నియామక మండలి నజరానా ప్రకటించింది. దళారుల గురించి తెలిసినవారు 93937 11110 లేదా 93910 05006కు సమాచారం ఇవ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. దళారులను నమ్మితే చిక్కుల్లో పడతారని, అలాంటి అభ్యర్థులు ఎంపికైనా వేటు తప్పదని హెచ్చరించింది. అంతేకాకుండా భవిష్యత్తులోనూ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు అర్హత లేకుండా పోతుందని తెల్పింది. నియామక ప్రక్రియ పారదర్శకంగానే సాగుతోందని, మెరిట్ ఆధారంగానే తుది జాబితా వెల్లడవుతుందని స్పష్టం చేసింది. ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని బోర్డు ప్రకటించింది.
మరోవైపు వయోపరిమితి ధృవీకరణ విషయంలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక విషయాన్ని వెల్లడించింది. నియామక ప్రక్రియలో ముందస్తుగానే ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించడం సాధ్యం కాదని చెప్పింది. ఈ ఏడాది మొత్తం 12.9 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అందువల్ల తొలిదశలోనే వాటిని పరిశీలించడం అసాధ్యమని పేర్కొంది. తుది రాతపరీక్ష తర్వాతే ధ్రువీకరణపత్రాల్ని పరిశీలించడం ఆనవాయితీగా వస్తోందని తెల్పింది. నోటిఫికేషన్‌లో పొందుపరిచిన విధంగా అర్హులైతేనే దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో పదేపదే ప్రకటించినట్లు గుర్తు చేసింది. వయసు విషయంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించొద్దని పేర్కొంది. కాగా తుది రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయినట్లు తాజాగా మండలి స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలనకు దాదాపు 89.2 శాతం మంది హాజరయ్యారు. 18 కేంద్రాల్లో జూన్ 14-26 మధ్య చేపట్టిన ధ్రువీకరణపత్రాల పరిశీలనకు 1,08,940 మంది గాను 97,175 మంది హాజరైనట్లు మండలి ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.