TS Eamcet 2023 Special Counselling: నేటి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌కు ఆప్షన్లు.. 23న సీట్ల కేటాయింపు

ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి గురువారం (ఆగస్టు 17) నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుగుతుంది. కౌన్సెలింగ్‌ ద్వారా కన్వినర్‌ సీటు పొందడానికి విద్యార్ధులకు ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు పొందని వారు ఎవరైనా ఉంటే ఆగస్టు 18న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్‌ వాకాటి కరుణ . ప్రత్యేక కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వీరికి ఆగస్టు 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్ధులు రెండు రోజుల్లోగా సీటు కేటాయించిన కాలేజీల్లో

TS Eamcet 2023 Special Counselling: నేటి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌కు ఆప్షన్లు.. 23న సీట్ల కేటాయింపు
TS Eamcet 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 17, 2023 | 2:40 PM

హైదరాబాద్‌, ఆగస్టు 17: ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి గురువారం (ఆగస్టు 17) నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుగుతుంది. కౌన్సెలింగ్‌ ద్వారా కన్వినర్‌ సీటు పొందడానికి విద్యార్ధులకు ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు పొందని వారు ఎవరైనా ఉంటే ఆగస్టు 18న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్‌ వాకాటి కరుణ . ప్రత్యేక కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వీరికి ఆగస్టు 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్ధులు రెండు రోజుల్లోగా సీటు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిపోయిన సీట్లను ఆగస్టు 25న స్పాట్‌ అడ్మిషన్ల పేరిట భర్తీ చేయనున్నారు. ఐతే ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం త్వరలో విడుదల చేయనుంది.

కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో దాదాపు 19,049 సీట్లు మిగిలిపోయాయి. వీటిల్లో కంప్యూటర్‌ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్‌సీ బ్రాంచ్‌లోనే 3,034 సీట్లు మిగిలి పోయాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 2505 సీట్లు, ఈసీఈలో 2721 సీట్లు, ఈఈఈలో 2630 సీట్లు, ఐటీలో 1785 సీట్లు, మెకానికల్‌లో 2542 సీట్లు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు.

మరోవైపు ఈ ఏడాది 2023-24 విద్యాసంవత్సరానికి గానూ పలు కాలేజీలు సివిల్, మెకానికల్‌ సీట్లను పెద్ద సంఖ్యలో రద్దు చేసుకున్నాయి. ఆ సీట్ల స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచులకు సంబంధించిన సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు అదనంగా మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు దాదాపు 14 వేల వరకు పెరిగాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు, అంతగా పేరులేని కాలేజీల్లో చేరడానికి ఇష్టపడటం లేదు. ఇక మెయిన్‌ సిటీలయిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో దాదాపు 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు విద్యార్ధులు ప్రవేశాలు పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న174 కాలేజీల్లో 83,766 కన్వినర్‌ కోటా సీట్లు, 33 వేలు యాజమాన్య కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..