Ramappa Temple: అందుకే కాకతీయుల పాలనను ఆదర్శంగా తీసుకున్నారు.. రామప్పకు యునెస్కో గుర్తింపుపై టీఆర్ఎస్ ఎంపీ..
Ramappa Temple: వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప ఆలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన),
Ramappa Temple: వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప ఆలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు రావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ సామ్రాజ్యాధినేతలు నిర్మించిన ఈ ఆలయ గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయ నిర్మాణ శైలిని కొనియాడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ లీడర్స్, పరిశోధకులు స్పందించారు.. స్పందిస్తున్నారు.
తాజాగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్పందించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. రామప్ప ఆలయంలో చెక్కిన ఆకృతులు ఈ రోజుల్లో యంత్రాలతో చేస్తే తప్ప సాధ్యం కాదన్నారు. కానీ, 800 ఏళ్ల క్రితమే ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని అన్నారు. కాకతీయుల కాలంలో నిర్మాణాల్లో ఎన్నో గొప్ప నిర్మాణాలు ఉన్నాయని, వాటిలో వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, కాకతీయ కళాతోరణం వంటి ఎన్నో నిర్మాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపుతో కాకతీయుల కళావైభవం విశ్వవ్యాపితం అయ్యిందన్నారు. కాగా, కాకతీయులు గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేశారని లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. కాకతీయుల పాలలను ఆదర్శంగా తీసుకునే.. తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ అనే పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.
ఇదే సమయంలో మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు మాలోతు కవిత కూడా స్పందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతనే రామప్పకు గుర్తింపు వచ్చిందన్నారు. యునెస్కో గుర్తింపుతో టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంత అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read:
Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురు, కొడుకుతో అసభ్యంగా ప్రవర్తించి.. చివరకు..
Tokyo Olympics 2020 Live: నిరాశపరిచిన భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్.. సెమీఫైనల్స్‌కు డిస్ క్వాలిఫై.!
మహారాష్ట్రలో వరద బీభత్సం.. ప్రభుత్వ సొమ్మును కాపాడేందుకు 7 గంటలపాటు బస్సు టాప్ పైనే గడిపిన మేనేజర్