AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: తెలంగాణకు నవోదయ విద్యాలయాల కేటాయింపులో కేంద్రం అన్యాయం.. బీజేపీపై నామా అటాక్‌.

TRS: తెలంగాణలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాజ్య సభలో రూల్‌ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని ఎంపీ కే కేశ రావు వాయిదా తీర్మానంలో కోరారు. ఇదే అంశాన్ని చర్చించాలని..

TRS: తెలంగాణకు నవోదయ విద్యాలయాల కేటాయింపులో కేంద్రం అన్యాయం.. బీజేపీపై నామా అటాక్‌.
File Photo
Narender Vaitla
|

Updated on: Mar 25, 2022 | 12:51 PM

Share

TRS: తెలంగాణలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాజ్య సభలో రూల్‌ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని ఎంపీ కే కేశ రావు వాయిదా తీర్మానంలో కోరారు. ఇదే అంశాన్ని చర్చించాలని లోక్‌సభలో లోక్‌ సభపక్ష నేత నామా నాగేశ్వరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే కేంద్రం వీటిపై చర్చిండానికి అనుమతించకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై టీఆర్‌ఎస్‌ లోక్‌ సభపక్ష నేత నామా నాగేశ్వరావు కేంద్రంపై మాటల దాడి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గత 8 ఏళ్లుగా లేవనెత్తుతూనే ఉన్నాము. కొత్తగా నవోదయ విద్యాలయ ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చాం. వాటిని అనుమతించక పోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశాము. 23 జిల్లాలో కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ , ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. 33 జిల్లాలు ఉంటే గతంలో ఇచ్చిన 9 మినహాయిస్తే కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా కేటాయించలేద’ని నామా వివర్శించారు.

తెలంగాణ విద్యార్థులపై అక్కసుతో కేంద్రం పలు విద్యా సంస్థలు, కొత్త మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయడం లేదని ఆయ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరొక న్యాయం అన్న విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ ఫెర్ఫామెన్స్‌లో కేరళ తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ఉందని తెలిపిన నామా.. 80 నవోదయ విద్యాలయాలు కొత్తగా కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో నవోదయా విద్యాలయాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్‌ ఎంపీల సమావేశం నిర్వహించారు. 33జిల్లాలకు 33నవోదయా స్కూల్స్‌ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. చిన్న రాష్ట్రమైన అసోంకి 27 నవోదయ స్కూల్స్‌ ఇచ్చారని, తెలంగాణకు కొత్తగా ఒక్క పాఠశాల కేటాయించలేదని కేంద్రాన్ని వివర్శించారు.

Also Read: Bheemla Nayak: దూసుకుపోతున్న పవర్ తుఫాన్.. స్ట్రీమింగ్ లో భీమ్లా నాయక్ సంచలనం

Cyber crime: యాప్ డౌన్ లోడ్ చేస్తే డబ్బులొస్తాయన్నారు.. ఇన్ స్టాల్ చేశాక నగదు మాయం చేశారు

Kim Jong Un: అమెరికా, జపాన్‌లకు చెమటలు పట్టిస్తున్న కిమ్.. తాజాగా శక్తివంతమైన ఐసీబీఎం క్షిపణి ప్రయోగం..