Bheemla Nayak: దూసుకుపోతున్న పవర్ తుఫాన్.. స్ట్రీమింగ్ లో భీమ్లా నాయక్ సంచలనం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ ఓటీటీ తుఫాన్ మొదలైంది. ఆహా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ ఓటీటీ తుఫాన్ మొదలైంది. ఆహా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్ లో సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇంట్లో కుటుంబ సభ్యులతో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ , ఆహాలో సినిమాను మరోసారి చూస్తున్నారు. తివిక్రమ్ పవన్ కాంబినేషన్ పవర్ ఫుల్ డైలాగ్స్ రిపీటెడ్ గా వింటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ కథనం మాటలు అందించగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలై థియేటర్ లలో పవర్ స్ట్రామ్ క్రియేట్ చేసింది.
బుధవారం అర్థరాత్రి నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ మొదలైంది. రాత్రి నుంచే ఫ్యాన్స్ టీవీల్లో సినిమాను చూసేస్తున్నారు. అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగిన సంఘర్షణను ఆస్వాదిస్తున్నారు. మలయాళ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను మనదైన స్టైల్ లో చూపించిన భీమ్లా…ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టేందుకు బయలుదేరింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు ఈ మూవీ రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తోపాటు డైలాగ్స్ రచించారు. పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. ఇక ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ ఫిల్మ్ తాజాగా హిందీలోనూ రిలీజ్ కు రెడీ అయిపోయింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vijay devarakonda: విజయ్, సమంత సినిమాపై క్రేజీ అప్‌డేట్.. అలనాటి సూపర్ హిట్ చిత్రం ఇతివృత్తంతో.?
Leopard vs Phone: ఫోన్ కాపాడిన ప్రాణం.. దెబ్బకు పరుగులు తీసిన చిరుతపులి.. పూర్తివివరాలివే..!