Telangana: ‘బీజేపీ నేతల అవినీతి కనిపించట్లేదా? వారిపై ఈడీ, ఐటీ దాడులేవి?’.. కేంద్రంపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం..

Telangana: తెలంగాణ రాజకీయం రోజుకో రకంగా భగ్గుమంటోంది. మునుగోడు ఉపఎన్నిక రూపంలో గానీ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గానీ, ఇప్పుడు ఈడీ, ఐటీ దాడుల..

Telangana: ‘బీజేపీ నేతల అవినీతి కనిపించట్లేదా? వారిపై ఈడీ, ఐటీ దాడులేవి?’.. కేంద్రంపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం..
Trs Vs Ed And It
Follow us

|

Updated on: Nov 10, 2022 | 5:08 PM

Telangana: తెలంగాణ రాజకీయం రోజుకో రకంగా భగ్గుమంటోంది. మునుగోడు ఉపఎన్నిక రూపంలో గానీ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గానీ, ఇప్పుడు ఈడీ, ఐటీ దాడుల రూపంలో గానీ, మధ్యలో గవర్నర్ ఇష్యూ.. మొత్తానికి తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందని ఫైర్ అయ్యారు. మునుగోడు ఓటమిని ఓర్వలేకనే కేంద్రంలోని పెద్దలు ఈడీ, ఐటీని రంగంలోకి దింపారని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, రవిచంద్ర ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులను ఖండిస్తున్నామన్నారు టీఆర్ఎస్ నేతలు. ఈడీ, ఐటీలకు కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలే కనిపిస్తున్నారా? బీజేపీ నేతలు చేసే అవినీతి కనిపించడం లేదా? అని కేంద్రాన్ని నిలదీస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నేతలపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపించారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర ఇంటిపై ఈడీ, ఐటీ దాడులను ఆ పార్టీ నేతలు ఖండించారు. తాము అధికారం లేని రాష్ట్రాల్లో ఎలాగైన అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో బీజేపీ పెద్దలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

దేశంలో అత్యంత అవినీతిపరులు బీజేపీ నేతలు అని, ఐటీ, ఈడీలకు వారు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీ నేతలపై ఎందుకు దాడులు జరుగవని ప్రశ్నించారు. దేశంలోని బీసీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం ఉధృత్వం చేస్తామని టీఆర్ఎస్ నేతలు తీవ్ర హెచ్చరికలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..