Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై కేసులు.. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు..

ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై కేసులు.. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు..
Attack On Minister Mallared
Follow us
Sanjay Kasula

|

Updated on: May 30, 2022 | 4:56 PM

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy)పై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్(TRS) నేతలు సోమవారం నాడు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 173, 147,149,341, 352, 506 కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ నేతలు సోమశేఖర్ రెడ్డి, హరివర్థన్ రెడ్డిపై కేసులు పెట్టారు. కొంత మంది పక్కా ప్లాన్ ప్రకారమే మంత్రిపై దాడి చేయించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి వెనక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ కేసు పెట్టారు. సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మల్లారెడ్డిపై వాటర్ బాటిళ్లు, కుర్చీలతో కొంతమంది దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రెడ్డి సభలో కాంగ్రెస్ నేతలు ప్లెక్సీలు పెట్టి, ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది ఆకతాయిలను తీసుకువచ్చి దాడి చేయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నెల 29న ఘట్ కేసర్‌లో జరిగిన రెడ్ల సింహాగర్జన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆ తర్వాత ఆయన సభ నుంచి వెళ్లిపోతున్న సమయంలో కొందరు మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంత్రి మల్లారెడ్డి ఈ దాడి నుండి తప్పించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై చెప్పులు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి కూడా సీరియస్‌ కామెంట్స్ చేశారు. తనను హత్య చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ఘట్‌కసర్‌లో తనపై దాడికి ప్రయత్నించింది రేవంత్ రెడ్డి అనుచరులేనని ఆయన ఆరోపించారు.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?