Huzurabad Operation: సీన్‌లోకి ఎంటర్ అయిన ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు.. హుజూరాబాద్ ఆపరేషన్ షురూ..!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు.
Harish Rao Started Operation Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని నుంచి బహిష్కరించిన తర్వాత కేడర్ చేజారకుండా జాగ్రత్తపడుతోంది. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్ హుజూరాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రిని ఒంటరిని చేసందుకు ఇన్నాళ్లూ లోకల్ కేడర్‌తో మీటింగ్‌లు జరిపింది. ఇప్పుడు ఏకంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులతో హరీష్ రావు సమావేశమయ్యారు.
ఆపరేషన్ హుజూరాబాద్.. ఈటలను ధీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ చేపట్టిన వ్యూహం. ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో మద్దతు లేకుండా చేయాలనే లక్ష్యంతో హరీష్ రావు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ మంత్రి గంగుల కమలాకర్ లోకల్ లీడర్లతో విడతల వారీగా చర్చలు జరిపారు. ఎవరూ టీఆర్ఎస్‌ను వీడి వెళ్లిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈటలపై ఇప్పటి వరకు పార్టీపరంగా చర్యలు తీసుకోకపోయినా.. ముందు జాగ్రత్తగా ప్రతివ్యూహం రచిస్తోంది. అనుకున్న ప్లాన్ ను మరింతగా అమలు చేసేలా ట్రుబుల్ షూటర్, మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపింది. ఈటలపై చర్యలు తీసుకుంటే… అక్కడ ఉపఎన్నికలు వస్తే ఎలా పట్టు నిలుపుకునేలా ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. అందుకే హరీష్‌ను రంగంలోకి దింపింది.
టీఆర్ఎస్ లో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తారనే విశ్వాసం కేసీఆర్ కు ఉంది. పలు ఎన్నికల్లో ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదేశాలతో సీన్‌లోకి ఎంటరైన హరీష్…. వర్క్ స్టార్ట్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో హరీష్‌రావు వరుస సమీక్షలు జరుపుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో హుజురాబాద్ అభివృద్ధి, క్యాడర్‌పై మానిటరింగ్ నిర్వహిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని చాలా మంది నేతలు హరీష్ రావుకు హామీ ఇస్తున్నారు.