Railways women crew: అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు.. ప్రత్యేక ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళలు

మహిళలు రైల్వే కో ఫైలట్‌గా సత్తా చాటుతున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణ వాయువును చేరవేస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిచి తమకు తిరుగలేదనిపించారు.

Railways women crew: అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు.. ప్రత్యేక ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళలు
All Women Crew Brings Oxygen Express Train
Follow us
Balaraju Goud

|

Updated on: May 22, 2021 | 4:12 PM

Women Crew Brings Oxygen Express: సాధించాలన్న సంకల్పం ఉండాలి కానీ అన్నిరంగాల్లో రాణించవచ్చని మరోసారి నిరూపిస్తున్నారు అతివలు. తామేమీ తక్కువ కాము అంటూ మహిళలు అన్నింట అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ పనులకే పరిమితమైన మహిళలు రైల్వే కో ఫైలట్‌గా సత్తా చాటుతున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణ వాయువును చేరవేస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిచి తమకు తిరుగలేదనిపించారు.

కోవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ఆక్సిజ‌న్‌కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు విడుస్తున్నారు. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు భార‌తీయ రైల్వేశాఖ ప్రత్యేక ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను న‌డుపుతోంది. ఇప్పటికే ఆ రైళ్లు వేల మెట్రిక్ ట‌న్నుల లిక్విడ్‌ ఆక్సిజ‌న్‌ను అయా రాష్ట్రాలకు చేరవేశాయి. తాజాగా జార్ఖండ్‌లోని టాటాన‌గ‌ర్ నుంచి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌కు చేరుకుంది.

అయితే, ఆ రైలులో మొత్తం మ‌హిళా సిబ్బందే ఉన్నారు. రైలు డ్రైవ‌ర్‌, అసిస్టెంట్ డ్రైవ‌ర్‌, గార్డ్.. ఇలా అంద‌రూ మ‌హిళ ఉద్యోగులు కావ‌డం విశేషం. వైట్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆ రైలు మొత్తం 120 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ జార్ఖండ్ నుంచి కర్ణాటకకు తీసుకువచ్చారు. ఆరు బోగీల‌తో రైలు బెంగుళూరు చేరుకుంది. భార‌తీయ రైల్వే శాఖ ఇప్పటి వ‌ర‌కు 13,319 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను.. 814 ట్యాంక‌ర్ల‌లో.. 208 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేసింది.

Read Also…  Covid Vaccine: ఆర్టీసీ సిబ్బంది, కూరగాయల వ్యాపారులకు వ్యాక్సిన్.. స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం

తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!