AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచంపై మృతదేహంతో మూడు కిలోమీటర్లు.. హృదయ విదారక ఘటన.. ఎక్కడంటే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కరకగూడెం మండలానికి చెందిన ఒక మహిళ అనారోగ్య సమస్యలతో భద్రాచంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు జట్టి కట్టి మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు.

మంచంపై మృతదేహంతో మూడు కిలోమీటర్లు.. హృదయ విదారక ఘటన.. ఎక్కడంటే!
Tg News
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 30, 2025 | 11:21 PM

Share

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీలు బతుకులు మాత్రం మారడం లేదు.. అభివృద్ధికి ఆమడ దూరములో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. హాస్పిటల్స్‌, రోడ్డు సైకర్యాలు లేక వాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు అనారోగ్యం బారిన పడి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీలో చోటుచేసుకుంది. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు అనే వలస గిరిజన గ్రామానికి చెందిన నందమ్మ అనే మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లో మృతి చెందింది.

అయితే ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వాళ్ల గ్రామానికి రహదారి లేకపోవడంతో ప్రధాన రహదారి నుండి జెట్టి కట్టి మృతదేహాన్ని చిమ్మ చీకట్లో మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు గ్రామస్తులు. దీంతో మృతదేహం కరకగూడెం చేరుకునే సరికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఇక వాళ్ల మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.

పాలకులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. వలస గిరిజనులు వచ్చి ఏళ్ళు గడుస్తున్న నేటికీ వారు నివసిస్తున్న గ్రామాలకు రహదారులు లేకపోవడం చూస్తుంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు, అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామాలకు రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వలస గిరిజనులు వేడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?