Viral Video: ఉరకలెత్తుతున్న పాండవలంక జలపాతం.. పర్యాటకుల సందడి! వీడియో

శ్రావణమాసంలో పాండవలంక జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలోని పాండవలంక జలపాతం వద్ద వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుట్టపై నుండి వర్షం నీరు రావడంతో జలపాతం వద్ద పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు..

Viral Video: ఉరకలెత్తుతున్న పాండవలంక జలపాతం.. పర్యాటకుల సందడి! వీడియో
Pandavalanka Water Falls

Edited By:

Updated on: Aug 21, 2025 | 4:21 PM

ప్రకృతి అందాలకు నెలవు ఆ జలదృశ్యం, ఆ జలపాతం నీటితో స్నానం చేసి, ఆ నీటిని సేవిస్తే సర్వ రోగాలు నయం అవుతాయని ఆ వాటర్ ఫాల్స్ కు క్యూ కడుతున్నారు టూరిస్టులు. అయితే సరైన రోడ్డు సౌకర్యం లేక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పర్యాటకులు, శ్రావణమాసంలో జలపాతం వద్ద సందడి చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలోని పాండవలంక జలపాతం వద్ద వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుట్టపై నుండి వర్షం నీరు రావడంతో జలపాతం వద్ద పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ప్రతి శ్రావణమాసం, వర్షాకాలం నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్టపై నుండి నీరు రావడంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు సమీప ప్రాంతాల నుండి కాకుండా, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి, వాటర్ ఫాల్స్ కింద స్నానం చేసి, జలపాతం నుండి కిందికి వస్తున్న నీటిని బాటిల్స్ లో తీసుకెళ్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

జలపాతం వద్ద స్నానం చేసి, ఆ నీటిని సేవిస్తే సర్వ రోగాలు నయం అవుతాయని పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు పాండవలంక ప్రాంతానికి. రామగిరి కిల్లాను ఆనుకొని ఉంది ఈ పాండవులంక, రామగిరి ఖిల్లా గుట్టపై ఎన్నో ఆయుర్వేద చెట్ల వన మూలికలు ఉన్నాయని, పూర్వం ఆంజనేయుడు కూడా సంజీవని మొక్కను కూడా ఈ ప్రాంతం నుండి తీసుకెళ్లి లక్ష్మణుడికి ప్రాణం పోశాడని చరిత్ర ఆనవాళ్ళు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి సరైన రోడ్డు, మార్గం లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబితం జలపాతానికి ఐదు కోట్ల కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పాండవులంక జలపాతానికి కూడా నిధులు వెచ్చించి, రోడ్డు సౌకర్యం కల్పించి, అభివృద్ధి చేయాలని పర్యటకులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.