AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: కారులోనే సెటప్.. పోలీసులకు సమాచారం.. వెళ్లి చూడగా స్టన్..

కారు మన ఊరుకి వస్తుంది..అవసరమైతే మన ఇంటి ముందుకే వచ్చి ఆగుతుంది.. అదేదో పికప్ క్యాబ్ సర్వీసులు అనుకునేరు. అందులో మనుషులు. లోపల సెటప్..  వాళ్లు చేసే బాగోతం ఏంటో తెలిస్తే మీరు కూడా వాళ్లను తిట్టిపోస్తారు. ఇంకా చెప్పాలంటే కర్రలతో కొడతారు కూడా. ఇంతకీ ఆ గ్యాంగ్ ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి...

Khammam: కారులోనే సెటప్.. పోలీసులకు సమాచారం.. వెళ్లి చూడగా స్టన్..
Gender Test Kit
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 03, 2025 | 12:51 PM

Share

ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరులో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఆర్ఎంపీల ముసుగులో ఒక కారు ఏర్పాటు చేసుకుని.. అందులోనే అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ సెటప్  చేసుకున్నారు. ముందుగానే ఆ ఊరులోని గర్భిణీల లిస్ట్ తెలుసుకొని..ఆ గ్రామానికి వెళ్ళి ఏమి తెలియనట్లు..గుట్టు చప్పుడు కాకుండా కారులోనే గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అని తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకునే అవకాశం మా దగ్గర ఉందని చూడా చెబుతున్నారు.  స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించి, ఏమీ తెలియని అమాయకులైన మహిళలను వలలో వేసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు..ఒక్కో పరీక్షకు రూ 10 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎలా పడితే అలా స్కానింగ్ వంటి పరీక్షలు చేపట్టడం లేదు. గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు బేబీ హెల్త్ అండ్ గ్రోత్ ప్రొగ్రెస్ తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి వైద్యులు స్కానింగ్ సూచిస్తారు. ఆ రిపోర్టులు చూసి.. పెరుగుతుంది అమ్మాయి లేదా అబ్బాయి అన్న విషయం డాక్టర్లు కానీ ,స్కానింగ్ సెంటర్ యజమానులు ఎక్కడా చెప్పకూడదు. ఇది పెద్ద క్రైమ్. ఊచలు లెక్కబెట్టడం గ్యారంటీ.

అయితే  డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు కాసులకు కక్కుర్తిపడి ఇలాంటి పనులకు ఒడి గడుతున్నారు.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఘరానా మోసగాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. తాజాగా ముగ్గురు సభ్యులు ముఠాను చింతకాని పోలీసులు అరెస్ట్ చేశారు.

కోదుమూరు గ్రామంలో ఒక అడ్డా ఏర్పాటు చేసుకుని.. స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తుండగా నిందితుల్ని అదుపులోకి తీసుకుని.. వారి వినియోగిస్తున్న స్కానింగ్ పరీక్షలు చేసే పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రెహమాన్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి హెచ్చరించారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి