Telangana: ఆ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్.. సీఎం రేవంత్ నంబర్ షేర్ చేసిన కీలక నేత..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తనను చంపేస్తామంటూ పలు నంబర్లనుంచి కాల్స్ చేసినట్లు తెలిపారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‎లను కూడా షేర్ చేశారు. ఈ క్రమంలో రాజా సింగ్‌ స్పందిస్తూ.. తనను చంపుతామని పదే పదే హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana: ఆ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్.. సీఎం రేవంత్ నంబర్ షేర్ చేసిన కీలక నేత..
MLA Raja Singh
Follow us
Srikar T

|

Updated on: May 30, 2024 | 5:06 PM

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తనను చంపేస్తామంటూ పలు నంబర్లనుంచి కాల్స్ చేసినట్లు తెలిపారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‎లను కూడా షేర్ చేశారు. ఈ క్రమంలో రాజా సింగ్‌ స్పందిస్తూ.. తనను చంపుతామని పదే పదే హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు లేఖ రాసినట్లు వివరించారు.

ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తెలపారు. ఫోన్‌ చేసి బెదిరించినవాళ్లు తన వద్ద ఎన్ని నంబర్లు ఉన్నాయని అడిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనవద్ద మరో నంబర్ కూడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చినట్లు చెప్పారు. తనకు వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తే ఆ దుండగులపై స్పందిస్తారా లేదా అన్న విషయంలోనే సీఎం నంబర్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్‌ వెళ్తే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశంతో సీఎం నంబర్‌ ఇచ్చానని తెలిపారు. ధర్మం కోసం పనిచేస్తే తనను, తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..