స్వీట్ రైస్ చేసుకోండి ఇలా.. పిల్లల ఇష్టంగా తింటారు..
04 December
2024
TV9 Telugu
స్వీట్ రైస్ తయారీ కోసం బియ్యం, పంచదార, పాలు, కుంకుమపువ్వు, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, నెయ్యి, బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ కావాల్సిన పదార్థాలు
పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ రైస్ కోసం ముందుగా ఒక గిన్నెలో కడిగిన బియ్యం తీసుకొని సరిపడా కొబ్బరి పాలు వేసి ఉడికించాలి.
స్టవ్‌పై అన్నం ఉడుకుతూ ఉన్న సమయంలోనే కుంకుమపువ్వు, పంచదార వేసి బాగా కలుపుకోని కొంతసేపు బాగా ఉడకనివ్వాలి.
తర్వాత సిద్ధంగా ఉంచుకొన్న కొబ్బరి తురుము వేసి కుంకుమ పువ్వు లేత పసుపు రంగులోకి వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
తర్వాత స్టవ్‌పై ఓ కడాయి పెట్టి నెయ్యి వేసి బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బాగా వేయించాలి.
కడాయిలో వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్‌లను కొబ్బరి పాలలో ఉడికించి పక్కన పెట్టిన రైస్‌లో వేసి బాగా కలపాలి.
అంతే మీ పిల్లలకు కచ్చితంగా నచ్చే రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడి వేడి స్వీట్ రైస్ తినడానికి సిద్ధం అయినట్లే.
మీరు పంచదార నచ్చకపోతే బెల్లం వేసుకుని కూడా ఈ స్వీట్ రైస్ రెసిపీని మీ ఇంట్లోనే సులభంగా టేస్టీగా చేసుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
విశాఖ టూ ఉత్తరాఖండ్.. ఐఆర్సీటీసీ నయా ప్యాకేజీ..
టాప్ 10 అంతరిక్ష పరిశోధనా సంస్థలు ప్రధాన కార్యాలయలు ఎక్కడంటే.?
ల్యాప్‌టాప్ కోసం ఈ యాక్ససరీలు ది బెస్ట్..