విశాఖ టూ ఉత్తరాఖండ్.. ఐఆర్​సీటీసీ నయా ప్యాకేజీ.. 

03 December 2024

TV9 Telugu

"దేవ్​ భూమి ఉత్తరాఖండ్​ యాత్ర​" పేరుతో వైజాగ్ ​నుంచి 10 రాత్రులు, 11 పగళ్లుగా కొనసాగే ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ.

మొదటి రోజు రాత్రి 8 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మొదలైన యాత్ర రెండో రోజు మొత్తం ట్రైన్​లోనే సాగుతుంది.

మూడో రోజు ఉదయాన్ని​ తనక్‎పూర్‎లో రైలు దిగి హోటల్లో ఫ్రెష్ అయ్యి లంచ్ తర్వాత పూర్ణగిరి,​ శారదా రివర్ ఘాట్​ చూసి నైట్ అదే​ హోటల్లో డిన్నర్, బస చేస్తారు.

నాలుగవ రోజు​ హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ చేసి చంపావత్ వెళ్లి బాలేశ్వర్, టీ గార్డెన్స్, మాయావతి ఆశ్రమం చూసి రాత్రికి అక్కడే హోటల్​లో డిన్నర్, స్టే ఉంటుంది.

ఐదవ రోజు హాత్​ కాలికా టెంపుల్​, పాటల్ భువనేశ్వర్​ చూసి చౌకోరిలో నైట్ డిన్నర్, స్టే చేసి డే6లో జాగేశ్వర్ ధామ్​, గోలు చిటై ఆలయాలు చూసి అల్మోరాలోని నైట్ ఉంటారు.

ఏడో రోజు నందాదేవి, కాసర్​ దేవి, కతర్మల్ సూర్య దేవాలయం, కైంచి ధామ్, బాబా నీమ్ కరోలి టెంపుల్ దర్శనం అనంతరం భీమ్తాల్‌ చేరుకొని డిన్నర్, బస అక్కడే చేస్తారు.

డే8 విషయానికి వస్తే.. నైనాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ మీరు బోటింగ్, షాపింగ్​ చేసుకోవచ్చు. అక్కడ నుంచి భీమ్‌తాల్‌కు తిరిగి వెళ్తారు. ఆ హోటల్లోనే స్టే చేస్తారు.

డే9లో నానక్​మట్ట గురుద్వారా చూసి రిటర్న్​ జర్నీ కోసం.. తనక్​పూర్ రైల్వే స్టేషన్  చేరుకొని డిన్నర్ ముగించి తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.

పదవ రోజు మొత్తం రైలు ప్రయాణం చేసి పదకొండవ రోజు విశాఖపట్నం​ చేరుకోవడంతో మీరు ఎంచుకొన్న టూర్​ పూర్తవుతుంది.

ఈ టూర్ కోసం స్టాండర్ట్ క్లాసులో రూ. 30,925, డీలక్స్​ క్లాసులో రూ.38,535 ఛార్జ్​ చేస్తున్నారు. ఇది డిసెంబర్ 16వ తేదీన ​అందుబాటులో ఉంది.