అణు బాంబు బరువు ఎంతో తెలుసా?

02 December 2024

TV9 Telugu

అణ్వాయుధాలను 1945లో జపాన్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలో రెండుసార్లు మాత్రమే ఉపయోగించింది.

ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 9 దేశాలకు మాత్రమే అణుబాంబు శక్తి ఉంది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా.

ఈ దేశాలలో కొన్ని అధికారికంగా అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) ద్వారా అణ్వాయుధ రాష్ట్రాలుగా గుర్తించారు.

అణ్వాయుధాలలో రెండు ప్రాథమిక రకాలు ఉన్నాయి: విచ్ఛిత్తి బాంబులు (అణు బాంబులు), ఫ్యూజన్ బాంబులు (హైడ్రోజన్ బాంబులు లేదా థర్మోన్యూక్లియర్ బాంబు).

అణుబాంబు బరువు ఎంత ఉంటుందో ఊహించగలరా..?  అణు బాంబు బరువు దాని రూపకల్పన, రకం, ఉపయోగించే ఉద్దేశ్యంపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం అమెరికా కొత్త అణుబాంబు బి61-13ని తయారు చేసే పనిలో ఉంది. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 24 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన బాంబు ఇది..!

జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా పడగొట్టిన లిటిల్ బాయ్ బరువు 9,700 పౌండ్లు.  అత్యాధునిక అణ్వాయుధాలు ఇప్పుడు చిన్నవి, తేలికైనవిగా తయారు చేస్తున్నారు..

మొదట్లో ఇవి ఎక్కువ బరువు ఉండేవి. కానీ ఇప్పుడు అవి చిన్నవిగా, మరింత ఖచ్చితమైనవిగా, శక్తివంతంగా తయారయ్యాయి.