నీటిపై తేలియాడే గ్రహం ఏదో తెలుసా..?

02 December 2024

TV9 Telugu

సౌర వ్యవస్థలో గ్రహాలు వాటి సొంతంగా అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. కానీ నీటిపై తేలియాడే సామర్థ్యం ఉన్న గ్రహం కూడా ఉంది.

సౌర వ్యవస్థలో నీటిలో ఈదగల ఏకైక గ్రహం శని. ఇది ఎలా సాధ్యమో కూడా ఈరోజు మనం ఇందులో తెలుసుకుందాం రండి..!

శని గ్రహం సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు తెలిపారు.

శని గ్రహం ఒక విధంగా గ్యాస్ బాల్ లాంటిది. ఇందులో 94 శాతం హైడ్రోజన్, 6 శాతం హీలియం ఉంటాయని వెల్లడించారు.

సౌర వ్యవస్థలో శని రెండవ అతిపెద్ద గ్రహం. ఈ గ్రహం చాలా వేగంగా తిరుగుతుంది. ఇక్కడ రోజు నిడివి 10 గంటల 39 నిమిషాలు.

శని గ్రహం సూర్యుడికి చాలా దూరంలో ఉంటుంది. భూమితో పోలిస్తే ఇక్కడ కేవలం 1 శాతం కాంతి మాత్రమే చేరుతుంది. ఇక్కడ గాలి ఎంతో బలంగా వీస్తుంది.

సౌర వ్యవస్థలోని ఈ రెండవ అతిపెద్ద గ్రహంపై గంటకు 1,800 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

శని సూర్యుని సౌర వ్యవస్థలోని ఆరవ గ్రహం. శని 1,434 మిలియన్ కిమీ దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీని కక్ష్య కాలం 29.45 సంవత్సరాలు.