Tollywood : మీడియం రేంజ్‌ హీరోలకు మిలియన్‌ ట్రబుల్స్‌.. అసలు మ్యాటర్ ఏంటంటే

మీడియం రేంజ్ హీరోలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా.. అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. కొత్త దర్శకులు, కొత్త కథలను ఎంచుకుంటున్నా.. కొంతమంది హిట్స్ అందుకోలేకపోతున్నారు.

Tollywood : మీడియం రేంజ్‌ హీరోలకు మిలియన్‌ ట్రబుల్స్‌.. అసలు మ్యాటర్ ఏంటంటే
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2024 | 1:44 PM

పెద్దగా మార్కెట్‌ లేని హీరోలు, గతంలో హిట్స్ లేని స్టార్స్‌ చేసిన సినిమాలు ఫైనాన్షియల్‌ గా ఇబ్బందులు ఎదుర్కొనేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హీరో రేంజ్‌ తో సంబంధం లేకుండా చాలా సినిమాలు ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోల ప్రీవియస్ మూవీస్ ఫెయిల్యూర్స్ అప్‌ కమింగ్ సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ లిస్ట్‌ లో మంచి క్రేజ్‌ ఉన్న హీరోలు కూడా ఉండటమే ఇంట్రస్టింగ్‌గా మారింది.

స్టార్ హీరోలతో పోటిగా వరుస సినిమాలతో అలరిస్తున్న నితిన్‌ సినిమాలకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పటం లేదు. ప్రజెంట్ రిలీజ్‌ కు రెడీ అవుతున్న రాబిన్‌ హుడ్‌, తమ్ముడు సినిమాలను ఆర్ధిక సమస్యలు వెంటాడుతున్నాయన్న వార్తలు ఇండస్ట్రీ సర్కిల్స్‌ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్‌ ను మించిన ఆ సినిమాల మీద ఖర్చు పెట్టడం వల్లే ఇప్పుడు సమస్యలు ఎదురువుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

మీడియం రేంజ్‌ సెగ్మెంట్‌ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న శర్వానంద్‌ ఈ మధ్య అనుకున్న రేంజ్‌ లో సక్సెస్‌ లు ఇవ్వలేకపోతున్నారు. ఒకటి రెండు సినిమాలు పర్వాలేదనిపించిన బిగ్ హిట్ అన్న రేంజ్‌ లో ఒక్క సక్సెస్‌ కూడా లేదు. అందుకే శర్వా హీరోగా ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్‌ లో రూపొందుతున్న సినిమాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్‌ టైమ్స్‌ లో శర్వా చేసిన సినిమాలో నిరాశపరచటంకు ఈ ఇబ్బందులకు కారణం అంటున్నారు క్రిటిక్స్.

సినిమాలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడటం వల్లే స్లో అయిన మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. భారీ బడ్జెట్‌ సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్, కెరీర్‌ స్టార్టింగ్‌ లో పర్వాలేదనిపించినా… తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డారు. రీసెంట్‌ గా భారీ బడ్జెట్‌తో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి మరో సారి చేతులు కాల్చుకున్నారు. దీంతో బెల్లంకొండ మార్కెట్‌ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

కెరీర్‌ కష్టాల్లో ఉన్న టైమ్‌ లో మూడు ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెట్టి మరింత ఇబ్బందుల్లో పడ్డారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం టైసన్‌ నాయుడు, భైరవంతో పాటు మరో మూవీలో నటిస్తున్నారు. వీటిలో టైసన్‌ నాయుడు మొదలై చాలా కాలం అవుతోంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ సినిమా డిలే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.