138 మందికి ఒక్కడే తండ్రి.. ఇది ఎలా సాధ్యం..?

04 December 2024

TV9 Telugu

ఎవరైన ఒకరు ఇద్దరికీ తండ్రి అవడం కామన్. ఇంకా అనుకొంటే నలుగురికి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి 100 మందిపైగా తండ్రి. అదేంటో చూద్దాం..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికి ఒకే తండ్రి ఉన్నారు.

ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

బీహార్‌లోని తిర్హుట్ పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం అధికారులు సిద్ధం చేసి ఓటరు జాబితాలో ఈ విషయం బయటపడింది.

724 మంది ఓటర్లలో 138 మంది తండ్రి పేరు మున్నా కుమార్ అంకిత్. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు.

ఈ విషయం ఔరాయ్ బ్లాక్‌లోని బూత్ నంబర్ 54లో వెలుగు చూసింది. డిసెంబర్ 5న ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

తండ్రి పేరుతో ప్రారంభమయ్యే ఓటర్ల పేర్లు, యూనికోడ్ ఫాంట్ కారణంగా వారి పేరు మున్నా కుమార్‌గా నమోదైంది.

వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది తెలుసుకొన్న అక్కడి ఎన్నికల అధికారులు తెలిపారు.