మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’… వాయనంగా పెసర్లు, చక్కర, బెల్లం!

తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ‘బతుకమ్మ పండుగ’.. తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు […]

మూడోరోజు 'ముద్దపప్పు బతుకమ్మ'... వాయనంగా పెసర్లు, చక్కర, బెల్లం!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 12:16 AM

తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ‘బతుకమ్మ పండుగ’.. తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది.

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్థాయి. బతుకమ్మ పండుగలో మూడోరోజైన ఈరోజు (సెప్టెంబరు 30) ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి ‘బతుకమ్మ’ ఆడతారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడోరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.

నైవేద్యాలు: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పించాలి. ఈరోజు బతుకమ్మను ఆరాధిస్తే ఆరోగ్యం, బోగభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు