Telangana: కేబినెట్‌లో కొత్తగా ప్లేస్ సంపాదించబోతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరంటే..
తెలంగాణలో మంత్రివర్గవిస్తరణపై.. చాన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. మూడు కీలక సామాజిక వర్గాల నుంచి కేబినెట్ మంత్రులను ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్... మాల, మాదిగ సమన్యాయం చేస్తూ... ఇప్పటివరకూ ప్రాతినిథ్యం లేని ముదిరాజ్‌లకు ఈసారి అవకాశం కల్పించింది. ఫుల్ డీటేల్స్ ఇలా ఉన్నాయి..

Telangana Cabinet
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు ఆమోదం లభించింది. కాగా ఈ ముగ్గురు ఎవరన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రిగా అవకాశం లభించింది. అలానే.. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలకు కూడా కేబినెట్‌లో బెర్త్ ఖరారైంది. మాల, మాదిగ, ముదిరాజ్ సామాజికవర్గాల నుంచి ఒక్కోక్కరికి అవకాశం కల్పించారు. ఆదివారం ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.