AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీ శాసనసభ పక్ష నేత ఎవరన్నదానిపై ఉత్కంఠ.. అధిష్టానంలో మదిలో ఏముంది?

ఇదిలా ఉంటే.. బీజేపీ అధిష్టానం శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటుంది అన్న దానిపైన చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీలో పార్టీ శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్ కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో అయన ఇక్కడే గెలవడంతో ఆయనకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లు గెలిచిన ఫ్లోర్ లీడర్‌గా మాత్రం ఆయననే కొనసాగించింది బీజేపీ హై కమాండ్....

Telangana: బీజేపీ శాసనసభ పక్ష నేత ఎవరన్నదానిపై ఉత్కంఠ.. అధిష్టానంలో మదిలో ఏముంది?
TS BJP
Sridhar Prasad
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 08, 2023 | 4:29 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 8 చోట్ల గెలుపొందింది. ఈ ఎనిమిదిలో రెండు చోట్ల తప్ప మిగతా ఆరు చోట్ల కొత్తవారే గెలిచారు. ఈ 6 మంది మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్య నేతలు ఎవరు కూడా గెలవలేదు. పాతవారు ఇద్దరిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీలో అడుగుపెడుతుండగా.. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెండోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ అధిష్టానం శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటుంది అన్న దానిపైన చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీలో పార్టీ శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్ కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో అయన ఇక్కడే గెలవడంతో ఆయనకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లు గెలిచిన ఫ్లోర్ లీడర్‌గా మాత్రం ఆయననే కొనసాగించింది బీజేపీ హై కమాండ్. ఆయన సస్పెన్షన్‌కు గురైనా మరొకరికి మాత్రం అవకాశం ఆ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పార్టీ ఆయనను మళ్లీ ఫ్లోర్ లీడర్ చేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా రాజాసింగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన తెలుగు భాష పైన ఆయనకు కమాండ్ లేకపోవడం ఆయన మైనస్. మూడోసారి ఆయనే గెలిచాడు కాబట్టి ఆయనకే అవకాశం ఇవ్వాలి అని పార్టీలోని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డిని కూడా ఫ్లోర్ లీడర్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది రాష్ట్రంలోని సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి ఆయనను చేయొచ్చని అనుకుంటున్నారు.

కానీ కామారెడ్డిలో అనూహ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి లపై విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలని బలమైన డిమాండ్ వస్తుంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతటా తిప్పాలని బిజెపి శ్రేణులు కోరుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పైన గెలిచిన సువ్వెందు అధికారిని ఎలా అయితే శాసనసభ పక్ష నేతగా చేసి రాష్ట్రంలో పార్టీ ఎలా తిప్పుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయాలని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.

ఆయన మాట్లాడగలడని సమస్యల పైన పోరాటం చేసే తత్వం ఆయనలో ఉందని ఇద్దరు ముఖ్య నేతల పైన గెలిచిన పేరు పార్టీకి కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. అయితే ఆయన రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి.. ఈ నేపథ్యంలో పార్టీ హై కమాండ్ ఏ మేరకు అయన వైపు మొగ్గు చూపుతుంది అనే సందేహం వ్యక్తం అవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..