CM Praja Darbar: ప్రజాభవన్‌లో తెరిచిన ప్రజా దర్బార్… సీఎం రేవంత్‌కు సమస్యలు చెప్పుకునేందుకు క్యూ కట్టిన జనం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వీకారం చేసిన మరుసటి రోజే.. ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు ముఖ్యమంత్రి. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకున్న సీఎం పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

CM Praja Darbar: ప్రజాభవన్‌లో తెరిచిన ప్రజా దర్బార్... సీఎం రేవంత్‌కు సమస్యలు చెప్పుకునేందుకు క్యూ కట్టిన జనం
Cm Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 08, 2023 | 3:45 PM

అనుకున్నట్లుగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వీకారం చేసిన మరుసటి రోజే.. ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు ముఖ్యమంత్రి. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకున్న సీఎం పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్‌ ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా భవన్‌కు చేరుకున్నారు. ప్రజాభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ సర్కార్ అధికారంలోకి రాగానే 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రగతి భవన్ నిర్మించారు. ఇందుకోసం రూ.38 కోట్లు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ అద్భుతమైన భవనంగా తీర్చిదిద్దారు. 2016 మార్చి నెలలో మాజీ సీఎం చంద్రశేఖర రావు హయాంలో ఈ భవన నిర్మాణం ప్రారంభించగా, 2016 నవంబర్‌లో నిర్మాణం పూర్తయింది. కేవలం 9 నెలల్లోనే ప్రగతి భవన్‌ను నిర్మించారు. మొత్తం 200 మంది కూలీల చేత ఈ ప్రగతి భవన్ ప్రస్తుతం ప్రజా భవన్ గా పిలవబడుతున్న ఈ భవనాన్ని రూపొందించడం జరిగింది. హఫీజ్ అనే వాస్తు శిల్పి ఈ భవనాన్ని రూపొందించారు. బ్రిటిష్ రెసిడెన్సి ఫలక్‌నుమా ప్యాలెస్ లాంటి భవనాలు రూపంలో కనిపించే విధంగా ఈ ప్రజా భవన్ ఉంటుంది.

తాజాగా నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్‌ను ప్రజాభవన్‌లో తిరిగి ప్రారంభించారు. దీంతో జనం తమ సమస్యలు సీఎంకు విన్నవించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇక ప్రజాభవన్‌లో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు జనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..