Telangana: పోలీస్ స్టేషన్‌లో నిప్పంటించుకున్న యువకుడు మృతి.. అసలు కారణం అదేనా?
మేకలతండాకు చెందిన లాకవత్ శీను, అతని భార్య రాధిక మద్య కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
జనగామ జిల్లా పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. భార్యాభర్తల పంచాయితీలో పోలీసుల అత్యుత్సాహమే తన ఆత్మహత్యకు కారణమని శ్రీను మరణ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. భార్యాభర్తల మధ్య గొడవతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు శ్రీను.
అయితే అధికార పార్టీకి చెందిన నాయకుడి ప్రోద్బలం మేరకే శ్రీనును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొట్టారని ఆందోళన చేపట్టాయి గిరిజన సంఘాలు. శ్రీను ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. శ్రీను ఆత్మహత్య అల్లర్లకు దారి తీసే అవకాశం ఉండటంతో పాలకుర్తిలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వరంగల్ ఎంజీఎం మార్చురీలో పోస్ట్‌మార్టం అనంతరం మధ్యాహ్నం పాలకుర్తికి శ్రీను డెడ్ బాడీ తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
అసలేం జరగిందంటే, జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండాకు చెందిన లాకవత్ శీను, అతని భార్య రాధిక మద్య కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శ్రీను ను పోలీసులు పాలకుర్తి పోలీస్ స్టేషన్ పిలిపించారు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఊగిపోయిన శ్రీను తన వాహనంలోని పెట్రోలు తీసి తనపై కోసుకున్నాడు. అంతటితో ఆగకుండా వెంటనే నిప్పుంటించుకున్నాడు. అతన్ని కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు ఆ మంటలు అంటుకున్నాయి. గాయాలపాలైన ముగ్గురిని పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..