Telangana: ఎఫ్ఆర్వో హత్య కేసులో కీలక మలుపు.. వారిని గ్రామబహిష్కరణ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫారెస్ట్ రేజంర్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో అన్యాయంగా ప్రాణాలు వదిలారు..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫారెస్ట్ రేజంర్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో అన్యాయంగా ప్రాణాలు వదిలారు ఫారెస్ట్ ఆఫీసర్. దీంతో ఆ గ్రామపంచాయితీ పాలకవర్గం గుత్తికోయల మీద ఓ నిర్ణయానికి వచ్చారు. చండ్రుగొండ మండలంలో ఉన్న ఎర్రబోడు గ్రామ పంచాయితీ పాలక వర్గం గుత్తికోయల మీద ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో గుత్తికోయలు ఉండడానికి వీలు లేదని తీర్మానం చేసుకున్నారు. వీరు చత్తీస్‌ఘడ్ నుంచి వచ్చినందున తిరిగి అక్కడికే తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫారెస్టు రేంజర్ శ్రీనివాస్‌రావును హత్య చేయడాన్ని పంచాయతీ పాలకవర్గం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎప్పుడు ఆ గుత్తి కోయలతోనే సమస్యలు వస్తున్నాయని.. వారిని లేకుండా చేయాలని స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ప్రాణాలు తీశారు. అయితే పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏకంగా ఫారెస్ట్ అధికారినే కత్తులతో నరికి చంపిన ఘటనలు మాత్రం ఎక్కడా లేవు. ఫస్ట్ టైమ్ ఇలా జరగడంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..