Telangana: నీటి కోసం తొట్టి వద్దకు వెళ్లిన ఇంటి యజమాని.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు
భానుడు భగ భగ మండిపోతున్నాడు. జనం ఎండలకు అల్లాడిపోతుననారు. మనం అంటే ఇంటి పట్టున ఉండి.. కూలర్లు, ఏసీలు వేసుకుని.. జ్యూసులు. ఇతర పానీయాలు తీసుకుంటూ తాపం నుంచి బయటపడతాం. పాపం వన్యప్రాణుల పరిస్థితి ఏంటి..?
ప్రచంఢ భానుడి ధాటికి వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, వీధిలోకి వెళితే ఎండ వాతతో ప్రత్యక్ష నరకాన్నే చుస్తున్నారు..అత్యవసర పనులతో రోడ్లపైకి వచ్చిన వారు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇంట్లో ఉండి.. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వేసుకుంటే అంతంత మాత్రం శాంతంగా ఉంటుంది. మన పరిస్థితి ఇలా ఉంటే.. పాపం వన్యప్రాణులు, ఇతర జీవాల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మిడ్ సమ్మర్‌లో అటవీ ప్రాంతాల్లోని చెలమలు, కుంటల్లో నీళ్లు సైతం ఎండిపోతాయి. గొంతు తడుపుకోడానికి కూడా నీళ్లుండవు. ఇక అవుడు గాలులకు అవి అల్లాడిపోయి జనావాసాల్లోకి వస్తుంటాయి.
వేసవి తాపాన్ని తట్టుకోలేక ఓ నాగు పాము అల్లాడిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఓ ఇంటి వద్ద ఉన్న నీటి తొట్టెలోకి వచ్చి సేద తీరింది. నీటి కోసం తొట్టి వద్దకు వెళ్లిన ఆ ఇంట్లోని వారు దాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసి.. బయట వదిలిపెట్టారు. ప్రజంట్ ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాకు సమీపంలో ఉన్న ఊర్లోలోకి ఎండాకాలంలో వేడి తట్టుకోలేక పాములు, ఇతర అటవీ జంతువులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో వాటిని ఆందోళనకు గురి చెయ్యకుండా తమకు సమచారం ఇవ్వాలని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి