Telangana: చోరికి గురైన లారీ.. ఈజీగా పట్టేసిన ఓనర్.. మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..!

దొంగలు కామన్ గా బంగారం, వెండి మరియు బైకులు దొంగతనాలు చేస్తుంటారు. కానీ ఈ దొంగ మాత్రం వెరైటీ, ఒక్క దొంగతనంతో జీవితంలో సెటిల్ అయిపోవాలని అనుకున్నాడో ఏమో ఏకంగా లారీని దొంగిలించాడు

Telangana: చోరికి గురైన లారీ.. ఈజీగా పట్టేసిన ఓనర్.. మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..!
Lorry Stolen
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Aug 04, 2024 | 5:13 PM

దొంగలు సైతం అప్‌గ్రేడ్ అయ్యారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దోచేస్తున్నారు. ఒక పోలీసుల సైతం రేంజ్‌లో చోరీ కేసులు ఛేదిస్తున్నారు. దొంగలు కామన్ గా బంగారం, వెండి మరియు బైకులు దొంగతనాలు చేస్తుంటారు. కానీ ఈ దొంగ మాత్రం వెరైటీ, ఒక్క దొంగతనంతో జీవితంలో సెటిల్ అయిపోవాలని అనుకున్నాడో ఏమో ఏకంగా లారీని దొంగిలించాడు. పాపం కానీ సీన్ రివర్స్ అయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో యజమాని తన లారీ చోరీకి గురైందని గుర్తించాడు. జిపిఎస్ ద్వారా తన లారీని పట్టుకున్నాడు. చివరికి దొంగ దెబ్బల పాలై కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో చోటుచేసుకుంది.

మణుగూరు నుండి భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గుని రవాణా చేసే లారీ లోడింగ్ లేకపోవడంతో, ఆఫీస్ వద్ద నిలిపి ఉంచాడు డ్రైవర్. అదే సమయంలో మద్యం మత్తులో అక్కడికి వచ్చిన ఓ దొంగ తాళం పగలగొట్టి లారీని ఎత్తుకుపోయాడు. ఒక్కసారిగా లారీ కనిపించకపోవడంతో దాన్ని వెతుకుతూ డ్రైవర్, తన యజమానికి విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే యజమాని ఈశ్వర్ రెడ్డి జిపిఎస్ ద్వారా లారీ రామానుజవరం వద్ద ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే అక్కడి వెళ్లి స్థానికులతో కలిసి లారీ పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లారీ దొంగిలించిన వ్యక్తి గతంలో డ్రైవర్ గా పని చేసేవాడని గుర్తించారు. దొంగకు నేర చరిత్ర కూడా ఉందని ఇటీవలే జైలు నుండి తిరిగి వచ్చాడని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నిందితుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మణుగూరు పోలీసులు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..