Telangana: రాష్ట్రంలో పెరుగుతున్న పులుల సంఖ్య.. పులులకు ఆవాసంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
తెలంగాణలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు కలిపి 2018 టైగర్ సెన్సస్‌లో 26 పులుల ఉండేవి. ఇప్పుడు తాజాగా 2022లో చేసిన సెన్సెస్‌లో వాటి సంఖ్య 30కు పైగా చేరుకుని ఉంటుందని అంచనా నిపుణలు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు కలిపి 2018 టైగర్ సెన్సస్‌లో 26 పులుల ఉండేవి. ఇప్పుడు తాజాగా 2022లో చేసిన సెన్సెస్‌లో వాటి సంఖ్య 30కు పైగా చేరుకుని ఉంటుందని అంచనా నిపుణలు అంచనా వేస్తున్నారు. సంఖ్యాపరంగా ఇది ఎంతో వృద్ధి చెందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే కేంద్రం దేశవ్యాప్తంగా ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మైసూరులో ప్రధాని మోదీ ‘50 ఇయర్స్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. అయితే ఈ సర్వేలో పులుల ఉనికి, వాటి స్థిర నివాసం ఏర్పరుచుకోడానికి అమ్రాబాద్‌లో అత్యంత సానుకూల పరిస్థితులున్నట్లు వెల్లడైంది.
పులుల కదలికలు, ఇతర అంశాలను తెలియజేసే మ్యాప్‌ల్లోనూ అమ్రాబాద్‌లో పులుల మనుగడ, సంరక్షణకు ఆరోగ్యకరమైన వాతావరణమున్నట్లు తెలిసింది. అయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. గతంలో గుడ్ కేటగిరీలో ఉన్న అమ్రాబాద్ వెరీగుడ్‌లోకి వెళ్లగా, కవ్వాల్ గుడ్ కేటగిరిలోనే కొనసాగినట్లు వెల్లడైంది. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ నిర్వహణకు సంబంధించిన మరిన్ని పాయింట్లు సాధించి ఉంటే వెరీగుడ్ కేటగిరిలోకి వెళ్లి ఉండేదని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.2018లో అమ్రాబాద్‌లో 18, కవ్వాల్‌లో 8 పులులు ఉన్నట్టుగా అప్పటి నివేదిక ద్వారా తెలిసింది. 2022 నాటికి ఒక్క అమ్రాబాద్‌లోనే 4 పులిపిల్లలతో సహా 26కు పైగా పెద్దపులులు ఉన్నట్లుగా తెలిసింది. అలాగే కవ్వాల్‌లో, టైగర్ కారిడార్ ఏరియాలు కలిపి ఆరేడు పెద్దపులులు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
