CM KCR Review: అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పంట నష్టాన్ని అంచనా వేయమని కలెక్టర్లకు సూచన
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా అకాల వర్షాల వలన కలిగిన పంట నష్టం వేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలను జారీ చేశారు.

వేసవి కాలం వచ్చేసింది. ఓ వైపు మండిస్తున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అప్పటి వరకూ భానుడు భగభగమనిస్తుంటే.. హఠాత్తుగా వర్షం, ఈదురుగాలులు, వడగళ్లతో ఇబ్బంది పెట్టేస్తోంది. అకాల వర్షాలతో తెలంగాణ రైతులు నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంట నాశనం అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా అకాల వర్షాల వలన కలిగిన పంట నష్టం వేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలను జారీ చేశారు.
పంటనష్టం పై అన్ని జిల్లాల కలెక్టర్లతో మట్లాడి నివేదికలను తెప్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టం సంభవించింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునిగి నష్టపోయింది. . దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
