Telangana: తెలంగాణకు 3 రోజులు వర్షసూచన.. భారీ ఈదురుగాలులు వీచే చాన్స్

ఏంటో తెలియదు కానీ నడి ఎండాకాలంలో వర్షాకాలంలో కురిసినట్లు వానలు కురుస్తున్నాయి. అప్పటి వరకు ఎండగానే ఉంటుంది. అంతలోనే నల్లటి మబ్బులు కమ్మేస్తున్నాయి. జోరు వాన కురుస్తుంది. ఇది గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న సీన్.

Telangana: తెలంగాణకు 3 రోజులు వర్షసూచన.. భారీ ఈదురుగాలులు వీచే చాన్స్
Telangana Rain Alert
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2023 | 4:49 PM

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అది కూడా సాధాసీదాగా కాదు భారీగా. ఉరుములు, మెరుపులే కాకుండా పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడుతున్నాయి. ఇక రోజూ ఏదో ఒక ప్రాంతంలో వడగళ్ల వానలు పడుతున్న దాఖలాలు కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా వెదర్ రిపోర్ట్ ఇచ్చింది హైదారాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మరో 3 రోజులు పాటు వర్షాలు దంచి కొడతాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఉంటాయని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీచే అకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. రాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట నేలపాలైంది. రాళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి పోయింది. జనగామలో భారీగా రాళ్ల వాన పడింది. ఈదురుగాలులకు ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రెయిన్ ఎఫెక్ట్‌పై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ వానకు ఈదురు గాలులు తోడవ్వడంతో, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టంపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ పూర్తిస్థియి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.  అయితే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో  రైతులకు కొంతమేర ఊరట లభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అదిరేలా ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్లు.. రెండు రోజులే అవకాశం
అదిరేలా ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్లు.. రెండు రోజులే అవకాశం
ఆధ్యాత్మిక వేడుకలో 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాలు
ఆధ్యాత్మిక వేడుకలో 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాలు
ఒరేయ్ ఆజామూ.! పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కొట్టేసిందిరోయ్..
ఒరేయ్ ఆజామూ.! పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కొట్టేసిందిరోయ్..
బిగ్ అప్డేట్: మార్కెట్లోకి కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయ్..
బిగ్ అప్డేట్: మార్కెట్లోకి కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయ్..
ప్లేయింగ్ 11 నుంచి ఈ ముగ్గురిని తప్పిస్తే టీమిండియాకు కష్టమే..?
ప్లేయింగ్ 11 నుంచి ఈ ముగ్గురిని తప్పిస్తే టీమిండియాకు కష్టమే..?
ఇలాంటి స్నేహితుడు పాము కంటే డేంజర్.. చాణక్యుడి హెచ్చరిక
ఇలాంటి స్నేహితుడు పాము కంటే డేంజర్.. చాణక్యుడి హెచ్చరిక
గూగుల్‌లో తెగ గాలిస్తున్నారట ఈ మూవీ కోసం..
గూగుల్‌లో తెగ గాలిస్తున్నారట ఈ మూవీ కోసం..
ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా 560097.. హింట్ ఇచ్చిన ఫ్రాంచైజీ
ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా 560097.. హింట్ ఇచ్చిన ఫ్రాంచైజీ
గులాబీ పువ్వులు ప్రేమకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా..!
గులాబీ పువ్వులు ప్రేమకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా..!
ఓరీ దేవుడో..ఇవేం ధరలు బాబోయ్.. 4 అడుగులు లేని ఫ్లాట్ కు వేలల్లో
ఓరీ దేవుడో..ఇవేం ధరలు బాబోయ్.. 4 అడుగులు లేని ఫ్లాట్ కు వేలల్లో