Telangana: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా కిమోథెరపీ
క్యాన్సర్ మహమ్మారి ఒక్కసారి సోకిందంటే దాని నుంచి బయటపడడం అంత సులువు కాదు. ఈ వ్యాధి చికిత్సకయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కిమో థెరపీ చేయించాలంటే రూ. వేలల్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి..

క్యాన్సర్ మహమ్మారి ఒక్కసారి సోకిందంటే దాని నుంచి బయటపడడం అంత సులువు కాదు. ఈ వ్యాధి చికిత్సకయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కిమో థెరపీ చేయించాలంటే రూ. వేలల్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త తెలిపారు. ఇకపై తెలంగాణలోని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో కీమోథెరపీ సేవలను అందిస్తున్నట్లు ప్రకించారు. ఇందులో భాగంగానే తొలిసారిగా సిద్ధిపేటలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరరంలోనే అందుతున్న కీమోథెరపీ సేవలను జిల్లా కేంద్రాల్లోనూ అందించడమే తమ లక్ష్యమని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జీజీహెచ్ ఆస్పత్రిలో డే కేర్ కీమోథెరపీ ప్రత్యేక వింగ్‌ను మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రారంభించారు. నాలుగు బెడ్స్‌తో ఈ వింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు.
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. ‘ఎలాగైతే డయాలసిస్ సేవలు అందుతున్నాయో.. అలాగే క్యాన్సర్ సేవలు కూడా అందిస్తాము. మొదటి సైకిల్ ఎంఎన్‌జే, నిమ్స్‌లో ఇస్తారు.. మిగతా సైకిల్ ట్రీట్‌మెంట్ జిల్లా ఆస్పత్రిలోనే తీసుకోవచ్చు. ప్రతి సైకిల్‌కు పేషెంట్‌కు ఆరు గంటల సమయం పడుతుంది. ఈ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో సైకిల్‌కు దాదాపు రూ.30వేలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తాము. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 468 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. వీరిలో కొందరికి కీమో థెరపీ అవసరం ఉంటుంది’ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
