TS Polycet 2023: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ పాలీసెట్-2023 ఆన్‌లైన్ దరఖాస్తులకు రేపే ఆఖరు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 10 విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో జనవరి 16న ప్రారంభమైంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ప్రక్రియ రేపటి (ఏప్రిల్ 24)తో ముగియ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 10 విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో జనవరి 16న ప్రారంభమైంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ప్రక్రియ రేపటి (ఏప్రిల్ 24)తో ముగియనుంది. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25న దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని ముగింపు సమయంలోపు అప్లై చేసుకోవల్సిందిగా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి, పరీక్ష కన్వీనర్ డాక్టర్ సి.శ్రీనాథ్ తెలిపారు.
పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్ధులతోపాటు ఈ ఏడాది పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్ 2023 పరీక్ష మే 17న పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పాలీసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



