TS Police Constable Hall Tickets: రేపే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష హల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్ టికెట్లు ఏప్రిల్ 24న విడుదలకానున్నాయి. కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు సోమవారం ఉదయం..

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్ టికెట్లు ఏప్రిల్ 24న విడుదలకానున్నాయి. కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు సోమవారం ఉదయం 8 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది.
వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఏప్రిల్ 30 తేదీన జరుగుతుంది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఐటీ అండ్ సీవో పోస్టులకు పరీక్ష మధ్యాహ్నం 2:30ల నుంచి 5:30ల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



