AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddavanam: తెలంగాణ పర్యాటక సిగలో మరో మణిహారం.. బుద్ధవనానికి అంతర్జాతీయ అవార్డు..

తెలంగాణలో విరాజిల్లిన బౌద్ధమత ఖ్యాతికి నిదర్శనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్‌లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు...

Buddavanam: తెలంగాణ పర్యాటక సిగలో మరో మణిహారం.. బుద్ధవనానికి అంతర్జాతీయ అవార్డు..
Buddhavanam
Ganesh Mudavath
|

Updated on: Dec 09, 2022 | 7:58 PM

Share

తెలంగాణలో విరాజిల్లిన బౌద్ధమత ఖ్యాతికి నిదర్శనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్‌లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం. ఇది తెలంగాణ పర్యాటక సిగలో మణిహారంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసోసియేషన్‌ ఆఫ్‌ బుద్ధిస్ట్‌ టూర్ ఆపరేటర్స్‌ ఏటా అందిస్తున్న బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, నేపాల్‌ దేశాల టూరిజం మిత్ర అవార్డును అందుకుంది. కోల్‌కతాలోని సిటీ సెంటర్‌ సాల్ట్‌ లేక్‌ సీఐ హాల్ లో ఈ అవార్డును అందజేశారు. కొరియా ఇండియా ఫ్రెండ్‌షిప్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ భిక్షు దమ్మ దీప చేతుల మీదుగా.. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఈ అవార్డును అందుకున్నారు. బౌద్ధ శిల్పకళ, బౌద్ధ సంస్కృతి పరిరక్షణ, శాంతిని పెంపొదించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తోందని అధికారులు తెలిపారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 2003 లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో బుద్ధవనం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ రాకపోయినా 2015లో రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు పూర్తయ్యాయి. దీంతో బుద్ధవనాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బౌద్ధ భిక్షువులకు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలోని సాంచీ, సారనాథ, అజంతా, అమరావతి, కారలే, మాణిక్యాల 5 రకాల స్థూపాల నమూనాలు, ప్రపంచంలో ఉన్న బౌద్ధులు ఒకే చోట స్థూప నమూనాలను ఈ పార్కులో నిర్మించారు.

బుద్ధుడికి సంబంధించి ప్రపంచంలో ఉన్న సంప్రదాయాలను ఆవిష్కరించేందుకు బుద్ధవనంలో ధ్యాన వనం ఏర్పాటు చేశారు. ఈ పార్కులో 27 అడుగుల అవకాన బుద్ధుడి అవతార విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుద్ధవనంలో నిర్మించిన మహాస్థూపం దక్షిణ భారత దేశంలో అతిపెద్దది. రెండు వేల సంవత్సరాల క్రితం శాతవాహన కాలంలో అమరావతిలో నిర్మించిన మహాస్థూపానికి సంబంధించిన కొలతలతో నిర్మించారు. గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ఐదు ఘట్టాలు ఇందులో ఉన్నాయి. బుద్ధుడి జననం, మహా నిష్క్రమణ, తపస్సు చేయడం, ఉపన్యాసం, మరణం వంటి ఘట్టాలను వివరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ అవార్డు దక్కడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..