Adilabad: అమర వీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న సమయంలో ఎమ్మెల్యే జోగు రామన్నపై చీమల దాడి..

|

Jun 02, 2023 | 10:09 AM

దశాబ్ది వేడులకు సర్వసన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మూడు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని అమర వీరుల స్తూపానికి ఎమ్మెల్యే జోగు రామన్న నివాళులర్పించడానికి వెళ్లిన సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 

Adilabad: అమర వీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న సమయంలో ఎమ్మెల్యే జోగు రామన్నపై చీమల దాడి..
Ts Formation Day
Follow us on

ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించింది. 2014 జూన్ 2న భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదోవసంతంలోకి నేడు అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్‌ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు.. తెలంగాణ ఆవిర్భవించి పదోవసంతంలోకి అడుగుపెడుతోన్న వేళ… అమరుల నెత్తుటి త్యాగాలను స్మరించుకుంటూ..దశాబ్ది వేడులకు సర్వసన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మూడు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని అమర వీరుల స్తూపానికి ఎమ్మెల్యే జోగు రామన్న నివాళులర్పించడానికి వెళ్లిన సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో అమరులైన తెలంగాణవీరులకు నివాళులర్పించేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న  సహా ముఖ్య అతిథిగా గంపగోవర్దన్ , జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తదితరులు హాజరయ్యారు. స్థూపానికి పూలాభిషేకం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే జోగు రామన్న పై చీమలు దాడి చేశాయి. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు నివ్వెర పోయారు. ఇంతలో చీమల దాడి నుండి తననితాను కాపాడుకునేందుకు జోగి రామన్న నేలపై కండువా పరిచి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.