Telangana: ATM కొల్లగొట్టేందుకు స్కెచ్.. కానీ వర్కువుట్ అవ్వలే.. కట్ చేస్తే

ఖతర్నాక్ స్కెచ్ వేశారు. ఏకంగా.. ఏటీఎంను కొల్లగొట్టి.. ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని భావించారు. అందుకు తగ్గట్లుగానే సామాన్లు తెచ్చుకున్నారు. తెల్లవారుజామున ఏటీఎంలోకి ఎంటరయ్యారు. అంతా ఓకే కానీ.. నగదు ఉన్న బాక్స్ ఓపెన్ అవ్వలే.. కట్ చేస్తే.....

Telangana:  ATM కొల్లగొట్టేందుకు స్కెచ్.. కానీ వర్కువుట్ అవ్వలే.. కట్ చేస్తే
Damaged ATM
Follow us

|

Updated on: Apr 29, 2024 | 5:47 PM

ఇళ్లలో దొంగతనాలు చేస్తే.. డబ్బు, ఇతర సొత్తు దొరుకుందో లేదో..? ఆ రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో.. ఇద్దరు దుండగులు ఏటీఎమ్ కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. యాక్షన్ ప్లాన్ ప్రకారం.. తెల్లవారుజూమున ఏటీఎం ముందు వాలిపోయారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్సయింది. వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ATMలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా..  రూ.8 లక్షల డబ్బు దగ్ధం అయ్యింది. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు ATMలోని సొమ్ము కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.  డబ్బు ఉన్న బాక్స్ ఓపెన్ కాకపోవడంతో.. నిరాశతో అక్కడి నుంచి జారుకున్నారు.

వారు వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత ATMలో షార్ట్ సర్క్యూట్‌ జరిగి.. అందులోని డబ్బు పూర్తిగా కాలిపోయింది. మార్నింగ్ బ్యాంక్ స్టాఫ్ వచ్చి చూసి.. తొలుత ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. దొంగల బాగోతం బయటపడింది. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. క్లూస్ టీమ్ సాయంతో త్వరలో నిందితులను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..