విడిపోయి 20 ఏళ్లు.. మరణించిన దోస్త్ కుటుంబానికి అండగా టెన్త్ బ్యాచ్
జనగామ జిల్లా లింగాలగణపుం మండలం చీటూరుకు చెందిన నోముల మల్లేశ్ (36) ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. చీటూరు జెడ్పీహెచ్ఎస్లో మల్లేశ్‌తో పాటు 2006-07 టెన్త్ పూర్తిచేసిన చిన్ననాటి స్నేహితులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మల్లేశ్ కుమార్తె పేరు మీద రూ..

లింగాలగణపురం, సెప్టెంబర్ 7 : విడిపోయి 20 ఏళ్లు అయినా..స్నేహితుడిని మర్చిపోలేదు..అనారోగ్యంతో మరణిస్తే…అతని కుటుంబానికి అండగా నిలిచారు టెన్త్ క్లాస్ దోస్తులు. వృత్తిపరంగా ఒక్కొక్కరు ఒక్కోచోట స్థిరపడినా ఇటీవల స్నేహితుడి మరణవార్త తెలుసుకుని చిన్ననాటి మిత్రులంతా చలించిపోయారు. అందుబాటులో ఉన్న స్నేహితులు చివరి చూపుకోసం అంత్యక్రియలకు హాజరయ్యారు. అకాలమరణంతో స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అంతా కలిసి తలో చెయ్యి వేసి ఆర్థికసాయం చేశారు.
జనగామ జిల్లా లింగాలగణపుం మండలం చీటూరుకు చెందిన నోముల మల్లేశ్ (36) ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. చీటూరు జెడ్పీహెచ్ఎస్లో మల్లేశ్‌తో పాటు 2006-07 టెన్త్ పూర్తిచేసిన చిన్ననాటి స్నేహితులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మల్లేశ్ కుమార్తె పేరు మీద రూ.55,000 పోస్టాఫీసులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. మృతుడి కుటుంబానికి ఆదివారం స్నేహితులంతా కలిసి డిపాజిట్ పత్రాన్ని అందజేశారు.
అకాల మరణం చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన పదో తరగతి క్లాస్‌మేట్స్‌ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బండ యాదగిరి, బర్ల గణేష్, బండ నాగరాజు, శాగంటి పరశురాములు, సీహెచ్ రాజు, ఎన్ రాజు, పి అశోక్, ఆర్ అరుణ్ ఎమ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




