Telangana: బాసరలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఎంపీపీ భర్తకు తీవ్రగాయాలు.. వెనుక నుంచి వచ్చి..

తెలంగాణలో కుక్కల స్వైరవిహారం దడ పుట్టిస్తోంది. లేటెస్ట్‌గా నిర్మల్‌లోని బాసరలో ఎంపీపీ భర్తపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో విశ్వనాథ్‌కు తీవ్ర గాయమైంది.

Telangana: బాసరలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఎంపీపీ భర్తకు తీవ్రగాయాలు.. వెనుక నుంచి వచ్చి..
Dog Attack
Follow us

|

Updated on: Mar 03, 2023 | 1:48 PM

తెలంగాణలో కుక్కల స్వైరవిహారం దడ పుట్టిస్తోంది. లేటెస్ట్‌గా నిర్మల్‌లోని బాసరలో ఎంపీపీ భర్తపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో విశ్వనాథ్‌కు తీవ్ర గాయమైంది. రాత్రి తన ఫ్రెండ్స్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చిన కుక్క.. నిర్దాక్షిణ్యంగా కరిచేసింది. ఎంతగా తప్పించుకున్నా కుక్క వెంటపడటం మానలేదు. అదే పనిగా కరిచేసింది. పక్కనే ఉన్న వ్యక్తి కుక్కను తరిమేడంతో భర్త విశ్వనాథ్‌ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పటికే కాలికి ఉన్న మాంసం ముద్ద బయటకు వచ్చింది.

విశ్వనాథ్‌ను కరిచిన కుక్క అక్కడినుంచి పారిపోయింది. మరోసటి రోజు ఏం జరిగిందో తెలియదు. అయితే, కుక్క చనిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపినట్టు తెలుస్తోంది. అయితే అది ఎవరి పని అన్నది మాత్రం తెలియరాలేదు. మళ్లీ గ్రామస్తులపై ఎక్కడ దాడి చేస్తుందేమోనని అనుమానించి చంపేశారా? కావాలనే చంపేశారా అన్నది తెలియాల్సి ఉంది.

కాగా.. బాసరలో పిచ్చి కుక్క స్వైర విహారం కలకలం రేపింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

ఇవి కూడా చదవండి