Telangana Sri Vaishnava: తెలంగాణ శ్రీవైష్ణవ రాష్ట్ర జేఏసీ సమావేశం.. సంఘం ఐక్యతపై కీలక చర్చలు
Telangana Sri Vaishnava: ఈ కార్యక్రమంలో ప్రముఖులు సంగీత దర్శకులు కొమండూరు రామాచార్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగ అర్చక సమాఖ్య అధ్యక్షులు కాండూరి కృష్ణమాచార్యులు, కాండూరి నరేంద్రాచార్యులు, తిరువరంగం ప్రభాకరాచార్యులు, శ్రీనివాసాచార్యులు, సత్యనారాయణ చార్యులు, వివిధ జిల్లా అధ్యక్షులు శ్రీ వైష్ణవ తెలంగాణ..

Telangana Sri Vaishnava: తెలంగాణ శ్రీ వైష్ణవ రాష్ట్ర జేఏసీ సమావేశం ఎల్బీనగర్‌లోని రాష్ట్ర భవనంలో ఇటీవల నిర్వహించారు. ఇందులో తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ హైదరాబాద్ ప్రాంతీయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు భారీఎత్తున పాల్గొని చర్చించుకున్నారు. వైష్ణవ సంఘం ఐక్యతకు, అభివృద్ధికై శ్రమిస్తున్న జేఏసీ చైర్మన్ కరీంనగర్ జిల్లాకు చెందిన పీచర కృష్ణమాచార్లను JAC కన్వీనర్‌గా ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు. కో కన్వీనర్‌గా డింగరి రవికుమార్‌ను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు సంగీత దర్శకులు కొమండూరు రామాచార్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగ అర్చక సమాఖ్య అధ్యక్షులు కాండూరి కృష్ణమాచార్యులు, కాండూరి నరేంద్రాచార్యులు, తిరువరంగం ప్రభాకరాచార్యులు, శ్రీనివాసాచార్యులు, సత్యనారాయణ చార్యులు, వివిధ జిల్లా అధ్యక్షులు శ్రీ వైష్ణవ తెలంగాణ రాష్ట్ర జేఏసీ సమావేశం లో పాల్గొని వైష్ణవ ఐక్య వేదికనుద్దేశించి వారి అభిప్రాయాలను, సూచనలను అందించారు.

గతంలో జరిగిన తప్పులను సవరించాలని నూతన కన్వీనరును కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర శ్రీ వైష్ణవ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ పీచర కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ తిరిగి ప్రారంభించాలని, అందులో వైష్ణవులకు 50% వాటా ఇవ్వాలని, అలాగే అర్చక ఉద్యోగులకు ఉన్న కటాఫ్ 2017 వరకు పొడిగించాలని, దూప దూప నైవేద్యాల స్కీము డేటును పొడిగించాలని కోరారు. అలాగే మండల, స్థానిక, జిల్లా స్థాయి వరకు శ్రీవైష్ణవ కులగణన జరగాలని, ఆన్‌లైన్‌లో డాటా పొందపరచాలని, ఆ తర్వాతే రాష్ట్ర స్థాయి ఎలక్షన్ నిర్వహించాలని కోరారు. త్వరలోనే విస్తృత స్థాయిలో కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.

