AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!

రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతం చేసే దిశకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ మేరకు మొదటగా రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!
Tg Schools
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 16, 2025 | 5:49 PM

Share

రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యూకేషన్‌లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 210 స్కూల్స్ తో పాటు మరిన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అంటారు. కానీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ యూకేజీలోనే విద్యార్థులను ఫస్ట్ క్లాస్ లోకి వెల్లేందుకు తయారు చేయనున్నారు ఉపాద్యాయులు.

అయితే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 210 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంబిస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒక్కో స్కూల్లో 30 మంది విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రైమరీ పాఠశాలల్లో ఐదేళ్లు నిండినవారిని ఒకటో తరగతిలో చేర్చుకుంటుండగా.. కొత్త ప్రీ ప్రైమరీ సెక్షన్ల ప్రకారం నాలుగేళ్లు నిండిన చిన్నారులను యూకేజీలోకి చేర్చుకోనుంది ప్రభుత్వం.

ఇక ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠాల బోధించేందుకు ఒక విద్యా వాలంటీర్ తోపాటు చిన్నారులకు అన్ని సౌకర్యాలు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 30 బడుల్లో ప్రీప్రైమరీ సెక్షన్ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలల్లోనే ఏర్పాటుకే అనుమతి ఇచ్చింది. త్వరలో మరో 700-800 పాఠశాలలకు మంజూరవుతాయని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..