AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navodaya Vidyalayas: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జూలై 15 నాటికి అన్ని నవోదయా విద్యాలయాలను ప్రారంభించి క్లాసులు మొదలుపెట్టేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Navodaya Vidyalayas: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!
Navodaya Vidyalaya
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 16, 2025 | 11:54 PM

Share

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఘనంగా ప్రారంభించి తరగతులు నిర్వహించేందుకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా రాష్ట్రానికి మంజూరైన ఏడు నవోదయ విద్యాలయాలు కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట లలో ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది జూలై 15 నాటికి క్లాసులు ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ వంతులైన విద్యార్థులకు అయా నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వారిని స్వాగతించేందుకు, నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!